Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మారణహోమానికి ముందు పెడ్డాక్ లక్ష డాలర్లు ఫిలిప్పీన్స్ కు పంపాడు... ఎవరికి?: మల్లగుల్లాలు పడుతున్న పోలీసులు

  • లక్ష డాలర్లను ఫిలిప్పీన్స్ కు పంపిన పెడ్డాక్
  • 23 తుపాకులను పది సూట్ కేసుల్లో సర్దుకుని హోటల్ కు వెళ్లిన పెడ్డాక్
  • పక్కా ప్లాన్ ప్రకారం చేసిన దారుణ మారణకాండ
రియల్‌ ఎస్టేట్ వ్యాపారం, అమెరికాలోని అన్ని ప్రధాన నగరాల్లో భవనాలు, సొంతంగా రెండు విమానాలు.. మరోపక్క చేతిలో తుపాకులు, రోజూ 30,000 డాలర్లతో జూదం.. స్టీఫెన్ పెడ్డాక్ లైఫ్ స్టైల్ ఇది. అలాంటి పెడ్డాక్ అంతమందిని ఉన్మాదిలా ఎందుకు కాల్చిచంపాడు? అసలు పెడ్డాక్ ఎందుకీ మారణకాండకు పూనుకున్నాడన్న రహస్యాన్ని ఛేదించేందుకు లాస్ వెగాస్ పోలీసులు చేయని ప్రయత్నం లేదు. ఈ నేపథ్యంలో పెడ్డాక్ కు సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తున్నారు. తాజాగా పెడ్డాక్ ఫిలిప్పీన్స్ కు లక్ష డాలర్లు పంపినట్టు అతని అకౌంట్ల ద్వారా గుర్తించారు.

అయితే అంత మొత్తం ఎవరికి పంపాడు? గర్ల్ ఫ్రెండ్ మారిలౌ డాన్లీకా? లేక మరెవరికైనా పంపాడా? అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. పెడ్డాక్ మా వాడే అన్న ఐఎస్ఐఎస్ ప్రకటన నేపథ్యంలో అతని వివరాలు మరింత జాగ్రత్తగా, నిశితంగా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పెడ్డాక్ ఈ దాడిని పొరపాటున క్షణికావేశంలో చేసిన దాడిగా నిపుణులు భావించడం లేదు. పక్కా ప్లాన్ ప్రకారమే చేశాడని చెబుతున్నారు. హోటల్ గదికి 23 తుపాకులను పది సూట్ కేసుల్లో సర్దుకుని తీసుకెళ్లాడని గుర్తించారు. దీంతో ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన సామూహిక హత్యాకాండ అని వారు చెబుతున్నారు. 
lasvegas
Mandalay Bay Casino
gun fire
paddak

More Telugu News